News

అలరించిన సంప్రదాయ నృత్యాలు

259views

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దేవస్థానం గురువారం సాయంత్రం సాయినరాజ డాన్స్‌ అకాడమీ, కడప బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.శ్రీశైలం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహాగణపతిం, భో..శంభో, శివతాండవం, హరహర శంభో, ఓం నమఃశివాయా, అఖిలాండేశ్వరి తదితర గీతాలకు చిన్న, విజయ, చిట్టి, తేజు తదితరులు నృత్య ప్రదర్శనతో అలరించారు. స్వామి, అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ధర్మపథం కార్యక్రమాలను దేవస్థానం చేపడతోంది.