News

త్వరలోనే షార్‌లో మూడో ప్రయోగ వేదిక

188views

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సాధ్యాసాధ్యాలు, నిర్మాణానికి అనువైన స్థలంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే నివేదికలు రూపొందించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న న్యూ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌ను దృష్టిలో ఉంచుకుని నూతన ప్రయోగ వేదికను నిర్మించనున్నారు.