
సంస్కృతమే విజ్ఞానానికి మూలమని, అందులోని శాసీ్త్రయ, వైజ్ఞానికతను నేటి తరానికి అందించాల్సి బాధ్యత అందరిపై ఉందని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు.తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు వారాలుగా ఎడ్యుకేషన్ రీసెర్చ్ మెథడాలజీ అంశంపై నిర్వహించిన సదస్సు ముగిసింది. వీసీ మాట్లాడుతూ సంస్కృతంలో నిగూఢమైన అంశాలు ఉన్నాయని, వాటిని నిశతంగా పరిశీలించాల్సి అవసరం ఉందన్నారు. ఆధునిక కాలంలోని విజ్ఞానాన్ని కొన్ని వేల ఏళ్లకు పూర్వమే సంస్కృతంలో వివరించారని వెల్లడించారు. అనంతరం కాంచీపురం ఎస్‌సీఎస్వీఎమ్‌వీ వర్సిటీ డీన్ కె.వెంకటరమణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించడం శుభపరిణామమన్నారు. సదస్సులో వేధిక్ వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్‌జీ త్రిపాఠి, ప్రొఫెసర్ కలైఅరసి, పి.వెంకట్రావు, ఎన్‌ఎస్‌యూ రిజిస్ట్రార్ రమాశ్రీ, ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఉమానరసింహమూర్తి, ప్రొఫెసర్ దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు.





