
మధురైలోని సమయనల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రొత్తగా నిర్మితమైన చర్చి ముందు పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానిక ప్రజలు “క్రైస్తవ మిషనరీలు హిందువులకు ధనాన్ని, కానుకలను ఎరవేసి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, కాదంటే తమను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని ” ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించటమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
‘పొలిమర్’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళనలో పాల్గొన్న ఒక మహిళ మాట్లాడుతూ “మేము ఎన్నో తరాలుగా ఇక్కడే సోది (గ్రామాలలో సంచరిస్తూ జ్యోతిషం చెప్పేవారు) చెప్పుకుంటూ జీవిస్తున్నాము. మతం మారడానికి అంగీకరించనందున ఇక్కడ చర్చి వర్గాలు మా ఇళ్ళపై రాలు రువ్వడంతోపాటు మాకు ఇక్కడ అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి.” అంతేగాక చర్చి వర్గాలు తాము పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్ళినపుడు తమ పిల్లలను బలవంతంగా చర్చికి తీసుకెళ్ళడం, ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళను చర్చికి రమ్మని వత్తిడి చెయ్యడం వంటివి చేస్తున్నాయని ఆమె తెలిపారు.
బిర్యానీ ప్యాకెట్ల వంటివి పంచడం ద్వారా చిన్న పిల్లల్ని ఆకర్షించి వాళ్ళను అనాథలుగా చిత్రీకరించి విదేశాల నుంచి నిధులు సేకరిస్తోందని కూడా ఆమె ఆరోపించారు.
“ఎన్నోసార్లు అత్యవసరపరిస్థితుల్లోనూ , మరే ఇతర సమయాల్లోనూ కూడా అర్థరాత్రి వేళల్లో కూడా ఇక్కడి ఆడవాళ్ళందరమూ నిర్భీతిగా తిరగ్గలిగాం. కానీ చర్చి వచ్చినప్పటి నుండి పరిస్థితులు మారిపొయ్యాయి. మేము ఆసుపత్రులకు, మరే ఇతర పనులపైనైనా రాత్రి వేళల్లో బయటకు ధైర్యంగా వెళ్ళలేకున్నాం. ఏ పొదల మాటు నుండో మాపై రాళ్ళు పడతాయి. ఇక్కడ మాకు ఈ చర్చి వద్దు. మమ్మల్ని రక్షించండి. హిందుత్వాన్ని కాపాడండి” అని వారు వేడుకుంటున్నారు.





