News

బీహార్లో ఆకాశం నుంచి రాలిపడ్డ 13 కిలోల రాయి

108views

సోమవారం బీహార్లోని మధుబని జిల్లాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. లౌకానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవ గ్రామంలో ఒక వింత వస్తువు పెద్ద శబ్దంతో ఆకాశం నుంచి పడింది. అయస్కాంత లక్షణాలు కలిగిన ఆ వస్తువును ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు 24/7/2019 బుధవారం పాట్నాలోని ఒక మ్యూజియంకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే ఉల్కగా భావిస్తున్న 13 కేజీల బరువుగల ఆ రాయి కొంతమంది రైతులు పొలాల్లో పని చేస్తూ ఉండగా పెద్ద శబ్దం చేస్తూ క్రింద పడినట్లుగా చెబుతున్నారు. అది పడిన చోట ఐదడుగుల మేర గొయ్యి ఏర్పడ్డట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మొదట దానిని జిల్లా ట్రెజరీ నందు శాస్త్ర సాంకేతిక నిపుణుల పరిశీలన నిమిత్తం ఉంచారు. అనంతరం జూలై 24న దానిని ముఖ్యమంత్రి సందర్శనార్ధం ఆయన అధికార నివాసానికి కూడా తీసుకెళ్ళి ఆ తర్వాత పాట్నాలోని మ్యూజియం కి తరలించారు.