
461views
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండోనేసియా తదితర దేశాల్లో ఇస్లాం భావాలున్న అతివాద మత బోధకులకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అతివాద మత బోధకుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన చెందిన బ్రిటన్.. వివిధ దేశాల్లోని ప్రమాదకరమైన బోధకులను గుర్తించేందుకు అధికారులను నియమించింది. దీని ద్వారా వారిని వీసా నిషేధిత జాబితాలో ఉంచి.. తమ దేశానికి రాకుండా చేయడం సాధ్యమవుతుందని భావిస్తోంది. అతివాదుల కారణంగా దేశ ప్రజాస్వామ్యం, బహుళ విశ్వాస విలువలు ప్రమాదంలో ఉన్నాయంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం ఉపన్యాసం ఇచ్చిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.





