
259views
అయోధ్య రామ మందిరం దర్శనం కోసం కాకినాడ నుంచి సోమవారం ప్రత్యేక బస్సు బయలుదేరింది.కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు ఈ స్పెషల్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు పది రోజులు ప్రయాణించి 14 క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి ఈ నెల 29న కాకినాడ చేరుకుంటుంది.
ఈ యాత్రలో పూరి, కోణార్క్, సాక్షి గోపాలం, భువనేశ్వర్, జాజిపూర్, గయ, బుద్ధగయ, శిరోగయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, సీతామడి, అయోధ్య, నైమిశారణ్యం వంటి ప్రాంతాలను భక్తులు దర్శించుకోనున్నారు. ఈ యాత్రకు భోజనం సహా ఒక్కొక్కరికి రూ.11,000 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎంయూవీ మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.





