
234views
తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణం మంగళవారం రాత్రి 10.25 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అధికారులు సోమవారం అందజేశారు. ఆలయంలో వేంచేసి ఉన్న మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూర్యేశ్వర స్వామివార్ల దివ్య కల్యాణం జరుపనున్నారు. ఉదయం 5.45 గంటలకు కల్యాణ మూర్తులను ఆహ్వానించడం, 8 లక్ష రుద్రాక్ష పూజ, సాయంత్రం 5 గంటలకు నంది వాహనంపై కల్యాణ మూర్తుల నగరోత్సవం నిర్వహించనున్నారు.





