
185views
మళ్లీ అధికారంలోకి భాజపా రావడం ఖాయమని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీయే కూటమికి 400 సీట్లు తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హరియాణాలోని రేవాడీలో ‘ఎయిమ్స్’కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దును అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించిందని, అయినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం ఆ అధికరణను చరిత్ర పుటల్లో కలిపేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ప్రజలు కూడా రానున్న ఎన్నికల్లో భాజపా ఒక్కదానికే 370 సీట్లు ఇవ్వనున్నారని చెప్పారు. అయోధ్యలో రామమందిరాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు అదే పార్టీ జై సియారామ్ నినాదాలిస్తుందని ఎద్దేవా చేశారు.





