News

శ్రీశైలంలో మహాకుంభాభిషేక పూజలు ప్రారంభం

222views

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం మహాకుంభాభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేశారు. 17నుంచి 20వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేదపారాయణాలు, హోమాలు నిర్వహిస్తారు. 21న శ్రీశైల ఆలయ ప్రాంగణంలో పునరుద్ధరించిన దేవాలయాల్లో యంత్ర, శివలింగ, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అ తర్వాత ఆలయ ఉత్తరం వైపు ఉన్న శివాజీగోపురంపై సువర్ణ కలశస్థాపన చేస్తారు. తర్వాత ప్రధానాలయాల గోపురాలకు, స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, పరివార దేవాతామూర్తులకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ పూజల్లో జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు పాల్గొన్నారు.