
ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక …, సాంస్కృతిక …., రాజకీయ రంగాలకు సంబంధించిన ఎన్నో విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను …., మరెన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రేడియో ఈ రోజు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం నంపాదించుకుంది. ఐక్య రాజ్య సమితి 1946 ఫిబ్రవరి 13వ తేదీన రేడియోను ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఐక్య రాజ్య సమితి విద్యా …, వైజ్ఞానిక …., సాంస్కృతిక వ్యవహారాల సంస్థ .యునెస్కో….. కూడా ఫిబ్రవరి 13వ తేదీన రేడియో దినోత్సవంగా నిర్వహించాలని తన 36వ నర్వ నభ్య సమావేశంలో తీర్మానించింది. రేడియో ప్రాముఖ్యం గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడం…., ప్రసార కర్తల మధ్య అంతర్జాతీయ స్థాయిలో నహకారాన్ని పెంచడం రేడియో దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. భారత దేశంలో ఆకాశవాణి పేరుతో రేడియో తన వినూత్నమైన …. వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో నిష్పాక్షికమైన వార్తా ప్రసారాలతో దేశ ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించింది. “శతాబ్ద కాలంగా ప్రజలను విజ్ఞాన వంతులను చేస్తున్న రేడియో ” అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది రేడియో దినోత్సవం నిర్వహిస్తున్నారు.





