News

వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు భారత దేశ జ్ఞాననిధులు : డా.మోహన్ భాగవత్

1.2kviews

‘‘వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, గీత, జైనగ్రంథాలు, బౌద్ధ త్రిపిటికలు మరియు గురుగ్రంథ్ సాహిబ్‌లలో సాధుసంతుల వాణి, ఇవన్నీ భారతదేశం యొక్క శ్రేష్ఠమైన జ్ఞాననిధి” అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఢిల్లీ ప్రాంత్)లో జరిగిన భగవాన్ మహావీర్ స్వామీజీ 2550వ నిర్వాహణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ.. రఘురామ మహావీర్‌ను స్మరించుకుంటామన్నారు.చతుర్వేదా: పురాణాని సరోపనిషదస్తదా రామాయణం భారతంచ గీతా సద్దర్శనాని చ జైనగమస్త్రిపిటకా: గురుగ్రంథ: సతాం గిర: ఏష: జ్ఞానిధి: శ్రేష్ఠ సర్వదా మన జ్ఞాన నిధిలో జైనులను సైతం స్తుతిస్తామని తెలిపారు. ఇది మన భారతదేశ జ్ఞాన నిధి అని అలాగే, బుద్ధుడు, జినేంద్ర, గోరక్ష, పాణిని, పతంజలి, శంకరులు, బద్వ, శ్రీరామానుజులు, జులేలాల్, చైతన్యులు, తిరువళ్లువార్, బసవేశ్వరులు వీరంతా మన జ్ఞాననిధికి చెందిన ప్రముఖులు మరియు ఉపదేశకులని పేర్కొన్నారు.