
299views
రామమందిరం ప్రారంభోత్సవంపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను ఉద్దేశించి ఆమె గత నెల 20న సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమానికి నిరసనగా తాను మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టుపై వివాదం చెలరేగింది. సుప్రీం కోర్టు లాయర్, భాజపా నేత అజేయ్ అగర్వాల్ శనివారందిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదైంది.




