
295views
సామాజిక మాధ్యమాల్లో శ్రీరాముని ఎడల అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావును కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ, సనాతన ధర్మ ప్రబోధన సమితి సభ్యులతో కలిసి దేవీచౌక్ వద్ద నుంచి ప్రధాన రహదారి మీదుగా వీరి ర్యాలీ సాగింది. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం ఎస్సై నాగరాజుకు సంఘాల తరఫున ఫిర్యాదును అందించారు. కార్యక్రమంలో వరసాల ప్రసాద్, తామర్ల రాంబాబు, జగన్నాధశర్మ, ఉంగరాల ఆదివిష్ణు, మామిడి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.





