
240views
హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేఛ్చాయుత వాణిజ్యంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని నావెల్ డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… యుద్ధ నౌక ఐ.ఎన్ఎస్ సంధాయక్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక భూమికగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సముద్ర మార్గంలో జరిగే వాణిజ్య మార్గాల్లో హిందూ మహాసముద్రం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు.





