News

మతాంతీకరణలు అడ్డుకోవడానికి టిటిడీ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక ప్రచారం

583views

మతాంతీకరణలు అడ్డుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిటిడి పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలోని ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే హిందూ ధార్మిక సదస్సు ఏర్పాట్లను ఈరోజు ఉదయం పరిశీలించారు.

అనంతరం మీడియాతో టిటిడి చైర్మన్ మాట్లాడుతూ ధర్మ ప్రచారాన్ని మరింత విసృతంగా నిర్వహించేందుకు మఠాధిపతులు,పిఠాధిపతులు సలహాలు స్వీకరించేందుకు ధార్మిక సదస్సును తిరుమలలో నిర్వహిస్తున్నామన్నారు. 57 మంది మఠాధిపతులు,పీఠాధిపతులు ధార్మిక సదస్సుకు హజరవుతున్నారని..ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో దళిత గోవిందం, కళ్యాణమస్తు,కళ్యాణోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు.