
318views
ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్‌మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్‌ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్‌మెంట్‌కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.





