News

హిందువుల నిరసనతో క్షమాపణలు చెప్పిన కడప ఎమ్మార్వో

477views

కడప ఎమ్మార్వో కార్యాలయం వెనుక వైపు ఉన్న హిందూ దేవి దేవతల విగ్రహాలను, రేకుల షెడ్డులను తొలగించడం బావ్యం కాదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి లు బాలకృష్ణ యాదవ్, లక్ష్మీనారాయణ రెడ్డి, కడప అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, పవన్ కుమార్ లు అన్నారు. తక్షణమే వాటిని యధావిధిగా పునర్నినిర్మించాలని కోరారు. అలాగే కడప ఎమ్మార్వో శివరామిరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం కడప ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రోడ్డులో ధర్నా చేపట్టారు. రోడ్లపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో ఎమ్మార్వో ఆందోళనలు చేస్తున్న ప్రదేశానికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆర్డిఓ, డి.ఎస్.పి, ఎమ్మార్వో ఇతర అధికారులు చర్చించి ఆందోళనకారుల డిమాండ్లను ఒప్పుకున్నారు. గుడికి హద్దులు, రహదారి ఏర్పాటు చేసి ధ్వంసమైన విగ్రహాలను అదే ప్రదేశంలో పునర్నిర్మిస్తామని హిందూ సంఘాల పెద్దలు, ఆలయ నిర్వహకుల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలు రాజకీయపార్టీల నాయకులు, సమరసత సేవ సంస్థ సభ్యులు,ఇతర హిందూ సంఘ నాయకులు పాల్గొన్నారు.