
సమరసతా సేవ ఫౌండేషన్, నంద్యాల నగర కన్వీనర్ చింతలపల్లె వాసు ఆద్వర్యంలో శనివారం ఇంటింటికీ కాషాయం – గుండె గుండెలో రామ నామం కార్యక్రమంలో భాగంగా నంద్యాలలోని బైటి పేటలో ఇంటింటికి కాషాయం జెండాలు మరియు శ్రీ రాముని క్యాలెండర్లు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ ధర్మ ప్రచారక్ ఈశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ దాసరి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమ గురించి వివరించారు.
ముఖ్య అతిథిగా బిజెపి నాయకుడు డాక్టర్ అభిరుచి మధు, విశ్వహిందూ పరిషత్ ప్రముఖ్ వై యన్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హిందువులంతా తమ ఇంటి పైన కాషాయ జెండా ఏర్పాటు చేయాలని,500 సంవత్సరాల నిరీక్షణ మరియు పోరాటం ఫలితంగా మన కల సాకారమవు తున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నంద్యాల రోటరీ క్లబ్ అధ్యక్షుడు దండే దస్తగిరి, సత్యం రెడ్డి, నగర సహా కన్వీనర్ పినకపాని, సురేంద్ర ఎల్లప్ప, రమేశ్ నంద్యాల సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ జీ .రమేష్, కసెట్టి చంద్ర, గంజి వెంకటేశ్వర్లు,బాలు, మధు, తేజ, సంతోష్ స్థానిక పెద్దలు దాదాపు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.





