
299views
శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం పరిపాలనా భవనంలో ప్రాథమిక సమావేశాన్ని ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఛైర్మన్ తెలిపారు. ప్రతి విభాగానికి సంబంధించిన ప్రణాళికలను కార్యాలయంలో అందజేయాలని, శివదీక్షా భక్తులకు దర్శనం, ఇరుముడి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేపట్టాలని, షామియానాలతో తాత్కాలిక వసతి, క్యూకాంప్లెక్స్‌లో దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ వంటివి చేపట్టాలని ఈవో తెలిపారు.





