
315views
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని నేలమాళిగకు చెందిన తాళాలను వారణాసి కలెక్టర్లకు అప్పగించాలని స్థానిక జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నేలమాళిగను వ్యాస్ జీ కా తెహ్ఖానాగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే విశ్వేశ్ బుధవారం వెలువరించిన తన ఆదేశాల్లో.. ‘జ్ఞానవాపి సముదాయంలో దక్షిణ ప్రాంత చివరిలో గల వ్యాస్ జీ నేలమాళిగకు తగిన రక్షణ అవసరం’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను వ్యాస్ జీ కా తెహ్ ఖానాకు రిసీవర్గా నియమించారు.





