
302views
అయోధ్యలో ఈనెల 22న జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్ర మాన్ని పురస్కరించుకుని తిరుమల నుంచి లక్ష లడ్డూ లను పంపేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. 25 గ్రాముల బరువున్న లడ్డూలను ఆలయ పోటు నుంచి శ్రీవారి సేవాసదన్కు తరలించి అక్కడ శ్రీవారి సేవకులతో చిన్నచిన్న కవర్లలో రెండేసి చొప్పున ప్యాకింగ్ చేశారు.టీటీడీ వాహనాల్లో రెండ్రోజుల్లో అయోధ్యకు తరలించి ప్రాణప్రతిష్ఠ రోజున భక్తులకు పంపిణీ చేయనున్నారు. అయోధ్యలో జరిగే వేడుకకు టీటీడీ నుంచి ప్రసాదాలు పంపాలని బోర్డు సమావే శంలో ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్, శ్రీవారి ఆలయ పోటు ఏఈవో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.





