
323views
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజైన శనివారం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భక్తులకు భృంగి వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం కళాకారులు, భక్తజన సందడి మధ్య శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నేత్ర శోభితంగా నిర్వహించారు.





