
201views
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పేస్‌ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘జీశాట్-20’ను నింగిలోకి పంపనుంది. ఈ మేరకు ‘స్సేస్‌ఎక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) తెలిపింది. 4,700 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని.. రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. ‘జీశాట్-20’ ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ఫాల్కన్-9 సేవలను వినియోగించుకోనుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఆ సమయానికి మరే రాకెట్ అందుబాటులో లేనందున ‘స్పేస్‌ఎక్స్’ సేవలను వినియోగించుకోవాల్సి వస్తోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.





