ArticlesNews

దైవ కణాల పరిశోధకుడు భౌతికశాస్త్ర వేత్త సత్యేంద్ర నాథ్ బోస్

431views

( జనవరి 1 – సత్యేంద్ర నాథ్ బోస్ జయంతి )

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వారిలో సత్యేంద్ర నాథ్ బోస్ ఒకరు.

బోస్ భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన కలకత్తాలో జన్మించారు. అతని తండ్రి సురేంధ్రనాథ్ బోస్ ఒక రైల్వే ఉద్యోగి. సురేంద్రనాథ్ బోస్ కు మొదటి సంతానంగా 1894 జనవరి 1న బోస్ జన్మించారు. అతని పూర్వీకులు కలకత్తాకు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియా జిల్లాలోని బారా జగులియాలో ఉండేవారు. అతను తన ఐదవ యేట విద్యాభ్యాసం ప్రారంభించారు. అతను చదివే పాఠశాల తన యింటికి దగ్గరలో ఉండేది. తర్వాత అతని కుటుంబం గోవాబహన్ కు మారినది. అచ్చట న్యూ ఇండియన్ పాఠశాలలో చేరారు. తన పాఠశాల చివరి సంవత్సరంలో అతను “హిందూ పాఠశాల” కు మారాడు. 1909లో జరిగిన మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు పొంది ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత విజ్ఞానశాస్త్రంలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి కలకత్తాలో గల ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్రరాయ్ లు అతని గురువులు. రెండు సంవత్సరాల తర్వాత ఢాకా నుండి మేఘనాథ్ సాహ కూడా ఇదే కళాశాలలో చేరారు.

విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన బోస్ అణు భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపారు. క్వాంటమ్ ఫిజిక్స్‌పై అధ్యయనం చేశారు. విశ్వంలోని ప్రాథమిక కణాలపై పరిశోధనలో భాగంగా 1920లలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేశారు. అతని అధ్యయనం వల్లే అణు భౌతికశాస్త్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కణాలపై వీరు సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్‌గా పరిగణిస్తున్నారు.విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృష్టి చాలా ఉంది. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విశ్వంలోని ఒక ప్రాథమిక కణానికి ఆతని పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు. భారతీయ శాస్త్రవేత్తలు సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్‌లను ఫిజిక్స్‌లో చెరగని ముద్రవేసిన త్రిమూర్తులుగా చెబుతారు.

1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు.కేవలం ఫిజిక్స్‌ మాత్రమేకాదు.మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్‌లోనూ ఆయన ఎంతో కృషి చేశారు. ఐన్స్టీన్ మెచ్చిన శాస్త్రవేత్తగా బోస్ పేరు పొందారు.