Newsvideos

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరి వారసత్వం ఒక్కటే : డా: మోహన్ భగవత్

391views

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరం ఒకే వారసత్వాన్ని చెందినవాళ్లమని మనందరి దేశం ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా: మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు జరుగుతున్న పూర్వోత్తర్ సంత్ మణికాంచన్ సమ్మేళన్ 2023లో పాల్గొని ప్రసంగించారు.సమాజాన్ని సంఘటితం చేసే శక్తి ధృడపడాలన్నారు. తరతరాలుగా అపరిష్కృతంగా ఉన్న జఠిల సమస్యలకు పరిష్కారం ఏంటని కలిసి కట్టుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.