News

ఆత్మనిర్భర అయోధ్య రామాలయానికి సొంతంగా సకల సదుపాయాలు

312views

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఆత్మనిర్భరతకి పెద్దపీట వేసినట్లు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 70 ఎకరాల్లో నిర్మితమవుతున్న సముదాయంలో 70 శాతం దట్టమైన పచ్చదనమే ఉంటుందన్నారు. రామాలయానికి ప్రత్యేకంగా మురుగునీటి, మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, దీనివల్ల అయోధ్య నగర మురుగునీటి, తాగునీటి సరఫరా వ్యవస్థలపై భారంపడదని చెప్పారు. సముదాయ సుందరీకరణ పనుల్ని ఆయన విలేకరులకు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు సులభంగా దర్శించుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆల యంలో ఆరోగ్య పరిరక్షణ కేంద్రంతోపాటు పెద్దఎత్తున మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఒకేసారి 25 వేలమంది భక్తులు తమ వస్తు వులు భద్రపరచుకునే ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయా నికి ప్రత్యేకంగా విద్యుత్తు సదుపాయాన్ని కల్పించడంతో పాటు సొంతంగా ఓ అగ్నిమాపక శకటాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. లిఫ్టుకు అదనంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం రెండు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

* దక్షిణాది తరహాలో ప్రాకారం

తొలిదశ ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొ చ్చింది. భక్తులు తూర్పు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణం నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయం లోకి వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 380 మీటర్ల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్మించాం. జీ+2 పద్ధతిలో ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి అంతస్తులో 392 చొప్పున స్తంభాలు, 44 ప్రవేశమార్గాలు ఉంటాయి. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పున, 732 మీటర్ల వైశాల్యంతో కైవారం నిర్మిస్తున్నాం. ఇలాంటి నిర్మాణం కేవలం దక్షిణాదిలో కనిపిస్తుంది’ అని రాయ్ చెప్పారు. సూర్యుడిని తలపిం చేలా 30 అడుగుల ఎత్తున నిర్మించిన 40 స్తంభాలు అయోధ్య నగరంలో రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలు స్థాయని తెలిపారు. రామాయణంలో స్థానం పొందిన మహర్షులతో పాటు శబరి, జటాయువు కూడా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరేలా చేశామన్నారు.