News

నెల్లూరులో హిందూ సమ్మేళన శోభా యాత్ర

250views

సమరసత సేవా పౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సంగంలో హిందూ సమ్మేళన శోభా యాత్ర, నగర సంకీర్తన నిర్వహించారు. స్థానిక సంగమేశ్వరాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర గ్రామంలోని పలు వీధుల్లో గుండా సాగింది. అనంతరం ఆలయం వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రణవాత్మనంద సరస్వతి, రాజరాజేశ్వరానందస్వామి, శ్యామ్‌సుందర్‌రెడ్డిలు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని గురించి వివరించారు. కార్యక్రమంలో పౌండేషన్‌ జిల్లా కన్వీనర్‌ శ్రీనివాసులు, మహిళా కన్వీనర్‌ గిరిజమ్మ, మండల కన్వీనర్‌ ముప్పూరు శ్రీనివాసులు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.