News

శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్న అమెరికన్లు

282views

హిందుత్వం పట్ల ఆకర్షితులైన పలువురు అమెరికన్లు విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానంద్రేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సనాతన ధర్మం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకున్నారు. కాగా హిందూ ధర్మం పట్ల ప్రదర్శిస్తున్న ఆసక్తిని చూసి స్వరూపానందేంద్ర స్వామి ఆనందం వ్యక్తం చేశారు.అమెరికాకు చెందిన డాక్టర్ నికోల్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య విధానంపై అధ్యయనం చేసేందుకు వీరంతా విశాఖ వచ్చారు. విశాఖలో చింతలూరు ఆయుర్వేద నిలయం వైద్యులు కాశీ విశ్వనాధ తేజస్వి వద్ద శిక్షణ తీసుకుంటూ మెళకువలను నేర్చుకుంటున్నారు.