News

మణిపూర్‌లో శాంతి కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపు

360views

మణిపూర్‌లో శాంతి, సంఘీభావాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా సేవా భారతి మణిపూర్ మరియు మణిపూర్ సేవా సమితి సంయుక్తంగా డిసెంబర్ 12న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్య V. భాగయ్య జీ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా V. భాగయ్య జీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కుంటూనే సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సమిష్టి కృషి అవసరమని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.సవాలు పరిస్థితుల మధ్య పిల్లల విద్యపై దృష్టి పెట్టాలని భాగయ్య జీ పిలుపునిచ్చారు.

ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పునరావాస శిభిరంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా, నిర్వాసితులకు 532 దుప్పట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే 75 మంది విద్యార్థులు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు

మణిపూర్ సేవా సమితి మరియు సేవా భారతి మణిపూర్ అధ్వర్యంలో ఇప్పటికే డిసెంబరు 10న లంబో ఖోంగ్ నాంగ్ ఖోంగ్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో నిర్వాసితులైన ప్రజలకు సుమారు 150 దుప్పట్లు మరియు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడంలో ఈ సంస్థల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మణిపూర్ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో శాంతి, ఐక్యతల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది.