
260views
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులకు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది టీటీడీ. 2.25 లక్షల 300 రూపాయల దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే పొందారు భక్తులు. డిసెంబరు 22 నుండి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను టిటిడి జారీ చేయనుంది. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా 4,23,500 టోకెన్లు మంజూరు చేయనడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠద్వార దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఇఓ ఎ.వి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.





