
250views
శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై-కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కొట్టాయం వరకు వందే భారత్ రైలు (06151)ను వారంలో రెండు రోజుల పాటు నడపాలని నిర్ణయించింది. ఈ రైలు డిసెంబర్ 15, 17, 22, 24 తేదీల్లో చెన్నై నుంచి తెల్లవారు జామున 4.15గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.15గంటలకు కొట్టాయం చేరుకోనుంది. అలాగే, 06152 వందేభారత్ శబరి రైలు డిసెంబర్ 16, 18, 23, 25 తేదీల్లో కేరళ టౌన్లో నుంచి ఉదయాన్నే 4.40గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు కాట్పడి, సేలం, పాలక్కడ్, అలువా స్టేషన్లలో ఆగనుంది.





