News

అప్పన్న ఆలయంలో అయ్యవారి సేవలు ఆరంభం

217views

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం అయ్యవారి సేవలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పగల్‌ పత్తు సేవగా పిలిచే ఈ సేవలు ముక్కోటి ఏకాదశి ముందు రోజు వరకు పది రోజుల పాటు జరుగుతాయి. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, ధూప సేవలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని బంగారు తొళక్కియాన్‌ పల్లకిలో ఆశీనులను చేశారు. దేవతామూర్తులతో ప్రత్యేక తిరువీధి నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.