News

ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు

206views

ముక్కోటి ఏకాదశి పర్వదినాన మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉత్సవాల ఆహ్వానపత్రికలు ఆవిష్కరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చి వారు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా స్వామి దర్శనం, శంకుతీర్థం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో తహసీల్దార్‌ జీవీ రామ్‌ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముక్కోటి ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆర్కే సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ముక్కోటికి వచ్చే వీఐపీలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులైనా సామాన్య భక్తులవలే క్యూలైన్లలోకి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.