News

ఆ చెల్లికి 50 మంది అన్నలు.

678views

బీహర్‌లోని రోహ్‌తక్ జిల్లా బదిలాదిహ్ గ్రామానికి చెందిన తేజ్ నారాయణ్ సింగ్‌కు నలుగురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు జ్యోతిప్రకాశ్ నీరలా. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. అయితే కొద్దికాలంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబానికి అరణ్యరోదనే. ఈ క్రమంలో తన కూతురు వివాహం నిశ్చయమవడంతో అందరిలాగే ప్రకాశ్‌తో పనిచేసిన సిబ్బంది బాస్‌కు పత్రిక పంపించారు. సాధారణంగా ఆర్మీ పెళ్లి, ఫంక్షన్లు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఓ వీరుడి చెల్లి పెళ్లికి ఎలాగైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని 50 మందిని పంపించి, వారింట్లో సంతోషం వెల్లివిరిసేలా చేసింది ఇండియన్ ఆర్మీ.

పెళ్లికొచ్చిన ప్రకాశ్ స్నేహితులు ఆయన లేని లోటు లేకుండా చేశారు. పెళ్లి కోసం రెండురోజుల ముందే ఇంటికి చేరుకున్నారు. పెళ్లి పన్నుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లిలో వివిధ పనుల కోసం రూ.5 లక్షలు కూడా అందజేసి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రకాశ్ చేసే పనులు చేసి అబ్బురపరిచారు. వధువును కళ్యాణ మంటపానికి సాంప్రదాయ పద్ధతిలో తీసుకొచ్చారు. తర్వాత కలిసి గ్రూపు ఫోటో దిగారు. 50 మంది ఒకే ఫోటోలో పట్టాలంటే కుదరదు కనుక .. రెండువరుసల్లో కొందరు కింద కూర్చున్నారు. చెల్లెలు శశికళ, బావ సుజిత్ కుమార్‌కు ఏ లోటు రానీయకుండా వ్యవహరించారు. సుజిత్ కూడా బెంగళూరులో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి రైల్వేలో ఉద్యోగి .శశికళ నేపథ్యం తెలిసి పెళ్లి చేసుకునేందుకు సుజిత్ ముందుకొచ్చినట్టు తెలిసింది.