News

బెంగాల్లో హింసను ఆపండి : మమతా బెనర్జీకి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన

1kviews

బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో హింసకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న అధికార కాంక్షే కారణమని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో హింసను మమత ప్రోత్సహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలను రక్షించడం కోసం, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం మమత చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ లో గతంలో ఎన్నడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని అన్నారు. హింసలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఒకే పార్టీకి చెందినవారని.. ఇకనైనా ఈ ఘటనలు ఆగాలని ఆయన కోరారు.