
ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కొలను భారతి ఉపాన్యాసకులు శివయోగేంద్రసరస్వతి స్వామి అన్నారు. ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని శివరామానంద ఆశ్రమం నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు హిందూ సంఘం సభ్యులు, ఎస్‌ఎస్‌ఎఫ్ సభ్యులు, వివిధ మాలదారులు, మహిళలు కలిసి నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన హిందూ సమ్మేళన సమావేశంలో శివయోగేంద్ర సరస్వతి మాట్లాడుతూ హిందూవులు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ముఖ్య అతిథులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ రిటైర్డ్ జడ్జి కాశీపట్ల శివప్రసాద్, భైరవగుండాల క్షేత్రాల పర్యవేక్షకుడు మునయ్యస్వామి, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా సహ కన్వీనర్లు నాగమోహన్‌రెడ్డి, సల్లానాగరాజు, జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ తిమ్మారెడ్డి, జిల్లా పరియోజన ప్రముఖ్ సోముల శ్రీనివాసరెడ్డి, జిల్లా ధర్మప్రచారక్ దాసరి శ్రీనివాసులు, ఆలయాల అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కొండయ్య, లక్ష్మణబాబు, ఎస్‌ఎస్‌ఎఫ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.





