News

జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు

313views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం-ఏఎస్‌ఐ నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. తుది నివేదిక సమర్పణకు మూడు వారాలు గడువు కోరుతూ ఏఎస్‌ఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్‌ గురువారం విచారించారు. 10 రోజులు గడువిస్తూ మరోసారి ఏఎస్‌ఐ గడువు కోరబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ వ్యవహారంలో హిందువుల తరఫు న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. తదుపరి విచారణను కోర్టు డిసెంబరు 11కు వాయిదా వేసిందని ఆయన తెలిపారు.