79
నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అతడి నుంచి నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకొన్నారు. ఎలాగైనా ఆర్జితసేవా టికెట్ పొందాలని నిందితుడు తన పాస్‌పోర్టు చివరి నంబర్లు మార్చి సుప్రభాత సేవల టికెట్లను బుక్ చేశాడు. కానీ టీటీడీకి అడ్డంగా దొరికిపోయాడు.