
ఇస్రోకు చెందిన శాస్త్రవేత్త వీఆర్ లలితాంబికకు ఫ్రాన్స్ ప్రభుత్వం అవార్డును ప్రధానం చేసింది. లీజియన్ డీహానర్ అవార్డుతో ఆ శాస్త్రవేత్తను సత్కరించారు. ఫ్రాన్స్, ఇండియా మధ్య అంతరిక్ష కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. భారత్‌లో ఉన్న ఫ్రాన్స్ అంబాసిడర్ థియరీ మాథ్యూ ఆ అవార్డును లలితాంబికకు అందజేశారు. 1802లో ఆ నాటి చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టి ఆ అవార్డును స్థాపించారు. ఫ్రాన్స్‌కు అత్యున్నత సేవలు అందించిన పౌరులకు ఆ దేశం లీజియన్ అవార్డును అందజేస్తుంది. అడ్వాన్స్‌డ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీలో స్పెషలిస్టుగా లలితాంబికకు గుర్తింపు ఉంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌పై ఆమె పనిచేశారు. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఫ్రెంచ్ స్పేజ్ ఏజెన్సీ సహకారం తీసుకున్నారు. సీఎన్ఈఎస్, ఇస్రో మధ్య కుదిరిన ఒప్పందంలో ఆమె కీలక పాత్ర పోషించారు.





