
198views
జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ ఎల్ఎఫ్)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. చరిత్రాత్మక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. ఢిల్లీలో యూఎన్ఎల్ఎఫ్ శాంతి ఒప్పం దంపై సంతకం చేసిందని తెలిపారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధ రించేందుకు ప్రధాని మోదీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఫలించినట్లయిందని పేర్కొన్నారు.





