News

మావోయిస్టుల చేతుల్లో పాక్ ఆయుధాలు

786views

మావోయిస్టుల వెనుక  పాక్ హస్తముందన్న అనుమానాలు బలపడుతున్నాయ్. ఎందుకంటే… చత్తీస్ గడ్ లో గురువారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది. నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుండి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ లభించిన ఆయుధాలు ఎక్కడివో తెలుసా..? ఏ దేశానివో తెలుసా..? పాకిస్థాన్ కు చెందినవి. పాకిస్థాన్ ఆర్మీ, నాటో దళాలు ఉపయోగించే కోచ్ జీ3, హెక్లెర్ రైఫిల్స్ ను భద్రతాదళాల అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని అధికారులు కూడా స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ ఉపయోగించే ఆయుధాలను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోల నుంచి జర్మనీలో తయారైన రైఫిల్ ను, అమెరికాలో తయారైన సబ్ మెషిన్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కు చెందిన ఆయుధాలు దొరకడం కలకలం రేపుతోంది.