
పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి రంగంలోకి దిగారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం పంపించగా అధికార టీఎంసీ కూడా హాజరవుతానని స్పష్టంచేసింది.
చిన్నగా మొదలై ..
సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణ .. కొనసాగుతూనే ఉంది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారకముందే గవర్నర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం రాజ్‌భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ, బీజేపీ పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఆల్‌పార్టీ మీటింగ్‌తో నేతల మధ్య ఏకాభిప్రాయం వచ్చి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో శాంతిభద్రతల తిరిగి యాథాతధస్థితికి వస్తాయని భావిస్తున్నారు.
Source : One India





