
738views
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నదానిపై నిఘా పెట్టారు. అదే సమయంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. నిఘా పటిష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.





