
హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఈ తరహా ఘటనే గుజరాత్‌లో చోటు చేసుకోగా అక్కడ కోర్టు మతోన్మాదికి జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..గుజరాత్ రాష్ట్రం వల్సాద్ ప్రాంతానికి చెందిన ఆజాద్ రియాజుద్దీన్(38) వినాయక చవితి వేడుకలను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. గణేషుడికి పూజలు చేస్తున్న కుక్కలు అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. దీనిపై హిందూ మత సంఘాలు అభ్యంతరం తెలుపుతూ రియాజుద్దీన్ పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు విచారించిన పోలీసులు నిందితుడిపై IPC సెక్షన్లు 153(A), 295(A), 114 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటన 2018లో జరిగింది. కేసు పూర్వపరాలను క్షుణ్ణంగా విచారించిన న్యాయమూర్తి, నిందితుడు ఆజాద్ రియాజుద్దీన్‌ను దోషిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించింది.
న్యాయమూర్తి తీర్పును హిందూ మత సంఘాలు స్వాగతించాయి. దేవతామూర్తులను, హిందూ మతాన్ని కించపరిచేవారికి తాజా తీర్పు ఒక చెంపపెట్టని అన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని ముస్లిం మతోన్మాదులకు హితవు పలికారు.
Source : OpIndia





