News

హిందూ దేవతల అశ్లీల చిత్రాల ఆన్‌లైన్‌ విక్రయంపై ఢిల్లీ పోలీసులు చర్యలు, ఉత్తరాఖండ్‌లో నిందితుల అరెస్టు

331views

హిందూ దేవతలకు సంబంధించి అశ్లీల చిత్రాల ఆన్‌లైన్‌ విక్రయంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదుతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లు, దేవతల అసభ్యకర, అభ్యంతరకర చిత్రాల ఆన్‌లైన్ విక్రయాలపై ఢిల్లీ మహిళా కమిషన్ దేశ రాజధాని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్ సెల్ విచారణ జరిపి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు నిందితుడి గురించి పూర్తి సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేయడంతో పాటు ఇంటర్నెట్ నుంచి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలిగించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. దేవతలను అవహేళన చేసే చిత్రాల ప్రదర్శనలను చట్టరీత్యా అడ్డుకోవాలన్నారు.