
369views
వినూత్న ఆలోచనలు కార్యరూపం దాల్చితే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో సాంకేతికతను ఆసరాగా చేసుకొని చిన్నారులు సైతం అద్భుతాలు సృష్టిస్తున్నారు.
తాజాగా అదే కోవకు చెందిన ఓ ‘హనుమాన్ డ్రోన్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో కొందరు హనుమంతుడి ఆకారంలో డ్రోన్‌ను రూపొందించి గాల్లోకి ఎగిరేలా చేశారు. ఆంజనేయుడు గాల్లో ఎగురుతున్నప్పుడు ఎలా కనిపిస్తాడో ఆ విధంగా డ్రోన్‌ను తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన వీడియోను వినాల్ గుప్తా అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దసరా వేడుకల్లో భాగంగా ఈ డ్రోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.





