News

‘అయోధ్య పిలుస్తోంది’ పేరుతో రామ మందిరం వీడియో విడుదల చేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌

338views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభిస్తున్న క్రమంలో కోవెల వీడియోను తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో గురువారం షేర్‌ చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ముగింపు’ అనే వ్యాఖ్యను జోడించింది. ఇందులో రామ మందిరానికి శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతుండటం కనిపిస్తుంది. ‘అయోధ్య పిలుస్తోంది’ అనే నేపథ్య సంగీతంతో రూపొందించిన వీడియోలో ఆలయంలోని ద్వారాలు, గోపురం, స్తంభాలు, ఫ్లోరింగ్‌తోపాటు మందిర నిర్మాణానికి ఉపయోగించిన భారీ యంత్రాలను చూడొచ్చు. రామ మందిరంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.