News

వాట్సప్‌ ఛానల్‌ ప్రారంభించిన యూజీసీ

248views

ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – యూజీసీ సోమవారం వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు.