
333views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు రాముడి విగ్రహం పూర్తిగా సిద్ధమవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తెలిపారు. మొత్తం మూడు రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వేర్వేరు శిల్పులు వీటిని చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించేదాన్ని ఎంపిక చేసి రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ‘‘51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో ఉండే రాముడు విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉంటాడు’’ అని విపిన్ భదౌరియా తెలిపారు.




